ఛండీఘర్: అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా, చేతన్ సింగ్ జౌరమజ్రా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం (నవంబర్ 1) రాజీనామా లేఖలను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపించారు.
కాగా, పఠాన్మజ్రా పాటియాలా జిల్లాలోని సనౌర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. చేతన్ సింగ్ జౌరమజ్రా సమనా నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాజీనామాకు గల స్పష్టమైన కారణం ఏంటన్నది వెల్లడించలేదు. అయితే, పంజాబ్‌లో సెకండ్ టర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆప్‌కు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం భారీ ఎదురు దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.
2027 ఫిబ్రవరి, మార్చి నెలలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండగానే అధికార ఆప్ ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే 40 నియోజకవర్గాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
