వికారాబాద్ జిల్లా: మురసు తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు మధ్యాహ్నం తర్వాత కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది.
భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) వికారాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు మధ్యాహ్నం తర్వాత కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిశాయి.
దాదాపు రెండు నెలలుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. వర్షంతో జిల్లాలో వాతావరణం చల్లబడింది.
