మెట్రో సిటీల్లో బతకాలంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. 20, 30 వేలతో బతికేద్దామంటే తిని తినక సగం కడుపుతో పడుకున్నట్లు ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో బతకాలంటే కనీసం 70 వేల నుంచి లక్ష రూపాయల పైన నెల సంపాదన ఉండాలి. ఇక బెంగళూరు అయితే ఈ మాత్రం కూడా సరిపోదు. అందుకే.. ఈ బిజీ లైఫ్, ట్రాఫిక్ జామ్స్, హై కాస్ట్, హై రెంట్స్.. ఇవేవీ వద్దురా దేవుడా అని ఒక జంట బెంగళూరు నుంచి గోవా రూరల్ కు షిఫ్ట్ అయ్యింది. ఆ సమయంలో ఖర్చుల గురించి వాళ్లు పోస్ట్ చేసిన వివరాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
బెంగళూరు నుంచి గోవాకు తరలి వెళ్లి ప్రశాంతమైన జీవితం మొదలుపెట్టారు రాధిక, ఏకాంష్ అనే దంపతులు. తమ రిలొకేషన్ ఖర్చులను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వివరంగా పంచుకున్నారు. ఒక నెల తర్వాత రీలొకేషన్ ఖర్చులు, అద్దె మొదలైన వివరాల గురించి పోస్ట్ చేశారు.
బెంగళూరు సొసైటీ నుంచి బయటకు వచ్చి సామాను స్టోర్ చేయడానికి 15 వేల రూపాయలు ఖర్చు అయ్యిందట. సామాను గోవాకు రవాణా చేయడానికి 24 వేల రూపాయలు, కారు సర్వీసింగ్, పీయూసీ, పెట్రోల్‌తో రోడ్ ట్రిప్‌కు 10 వేల ఖర్చు అయ్యిందని పేర్కొన్నారు.
ఇళ్లు వెతుక్కునే వరకు మూడు వారాలు ఎయిర్ బీఎన్బి (Airbn)లో ఉన్నారట. ఈ మొత్తం ఖర్చు 45 వేల రూపాయలు అయ్యిందని చెప్పారు. ఈ మొత్తం ఖర్చు బెంగళూరులో చెల్లించే నెల అద్దెకు సమానమని చెప్పారు. అయితే ఈ మొత్తాన్ని అదనంగా రిలొకేషన్ ఖర్చుల్లో చేర్చలేదు.
►ALSO READ | పోలీస్ స్టేషన్ లోనే మహిళపై అత్యాచారం : 15 మంది పోలీసులు సస్పెండ్.. ముగ్గురి అరెస్ట్
కిరాణా, ఆర్డర్, బయట తినడంతో ఫుడ్ ఖర్చులు 12 వేల రూపాయలు అయినట్లు పేర్కొన్నారు. ఇళ్లు చూసేందుకు పెట్రోల్ ఖర్చులు 5 వేలు అయ్యిందట. కొత్త ఇంటిని సెటప్ చేయడానికి (ఎసీ, వాషింగ్ మెషీన్, కార్పెంటర్, ప్లంబర్) సుమారు 9 వేల500 రూపాయలు అయినట్లు చెప్పారు. ఇలా మొత్తం అదనపు ఖర్చు 75 వేల 500 రూపాయలు అయిందని చెప్పారు.
ఐదు రోజుల గోవా ట్రిప్‌కు 30 వేల నుంచి 40 ఖర్చు పెడతారు. మేము కొత్త జీవితం మొదలుపెట్టేందుకు 75 వేలు ఖర్చు పెట్టడం విలువైనదేనని రాధిక, ఏకాంష్ అన్నారు.
సెప్టెంబర్‌లోనే బెంగళూరు వదిలి వేరే చోట కొత్త జీవితం స్టార్ట్ చేయాలని భావించారట. ఇప్పుడు గోవాలో ఇళ్లు చూసుకోవడం, ఖర్చులు వంటి విషయాలను కూడా వారు డాక్యుమెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
