మెరుగుపడిన రాప్తాడు బాధిత బాలిక ఆరోగ్యం.. వెంటిలేటర్‌ తొలగింపు

మెరుగుపడిన రాప్తాడు బాధిత బాలిక ఆరోగ్యం.. వెంటిలేటర్‌ తొలగింపు

బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాప్తాడు బాధిత బాలిక హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. బాలిక ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని, ఇక వెంటిలేటర్‌ అవసరం లేదని తొలగించారు. ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైద్యులతో మాట్లాడారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 

ఇదిలా ఉండగా.. పోలీసుల కాల్పుల్లో గాయపడిన రాప్తాడు నిందితుడు హేమంత్‌కు వైద్యులు ఆపరేషన్ చేశారు. అతని కాళ్లకు శస్త్ర చికిత్స చేసి బుల్లెట్లు తొలగించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

రాప్తాడు మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్‌‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై హేమంత్ ( 21) మొద్దులు కోసే రంపం మిషన్‌‌తో దాడి చేశాడు. నేరుగా స్కూల్లోకి వెళ్లిన నిందితుడు.. తరగతి గదిలోనే పిల్లలందరితో పాటు టీచర్ చూస్తుండగానే ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడికి తెగపడ్డాడు.

ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అటాక్‌‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలను ఈ దుశ్చర్య ఉలిక్కిపడేలా చేసింది.