తిరుపతిలో విషాద ఘటన.. SBIలో జాబ్ చేస్తున్న యువతి దారుణ హత్య

తిరుపతిలో విషాద ఘటన.. SBIలో జాబ్ చేస్తున్న యువతి దారుణ హత్య

తిరుపతి: ఏపీలోని తిరుపతిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. SBI క్రెడిట్ కార్డు విభాగంలో పనిచేస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన భాగ్యశ్రీ తిరుపతిలో ఉద్యోగం చేస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ తిరుపతి STV నగర్లో ఒక పీజీ హాస్టల్లో ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు గానీ.. అక్టోబర్ 30 నుంచి ఆమె మొబైల్ స్విఛాప్ వచ్చింది.

కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. కనిపించకుండాపోయిన ఆమె కోసం వెతుకులాట సాగించగా.. సి.మల్లవరం హైవే ప్రాంతంలో ఆమె డెడ్ బాడీ దొరికింది. ఆమెను హత్య చేసి అక్కడ పడేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 

ఆమె దుస్తులు, నగలు చూసి తమ కూతురే అని భాగ్యశ్రీ తల్లిదండ్రులు వేణుగోపాల్, లక్ష్మీదేవి చెప్పారు. తిరుపతి రూరల్ సీ.ఐ మద్దయ్య చారి ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఈ మర్డర్ మిస్టరీని త్వరలోనే సాల్వ్ చేస్తామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామ‌ని మీడియాకు తెలిపారు.