రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రష్మిక లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన మూవీ టీమ్ ‘ఓ మైసా రే’ అంటూ సాగిన ఫస్ట్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేశారు. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన పాటకు సుద్దాల అశోక్ తేజ పవర్‌ఫుల్ లిరిక్స్ రాయగా, సింధూజ శ్రీనివాసన్ పాడిన తీరు ఆకట్టుకుంది. ఇందులో మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరిస్తూ దైవిక స్త్రీ శక్తిని, అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబిస్తోంది.
‘‘శత్రువుల పుట్టుకపై కత్తులనే నూరాలే.. దాయే దాయే ఈషి.. బాణాలకు నెత్తుటితో తాణాలు పోయాలే.. ధనసు మీద మనసు పెట్టి పసుపు సిలకరించాలే.. పిడికిళ్లతో కొడవళ్లను ముడుపు కట్టుడే.. ’ అంటూ అంటూ సాగిన పాట మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ, ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని చాటుతున్నాయి. ఇందులో గోండు గిరిజన మహిళగా రష్మిక కనిపించిన తీరు ఆకట్టుకుంది. బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది.
అటవీ నేపథ్యం, అధిక సంఖ్యలో డ్యాన్సర్లతో రూపొందించిన ఈ పాట ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు. ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
