మ్యాక్సివిజన్‎లో అత్యాధునిక స్మైల్ ప్రో టెక్నాలజీ

మ్యాక్సివిజన్‎లో అత్యాధునిక స్మైల్ ప్రో టెక్నాలజీ

హైదరాబాద్​, వెలుగు: కంటి వైద్య సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ తమ హైదరాబాద్ సోమాజిగూడ ఆసుపత్రిలో అత్యాధునిక స్మైల్ ప్రో సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. నటుడు నాగార్జున, ఆసుపత్రి వ్యవస్థాపకుడు కాసు ప్రసాద్ రెడ్డి, చైర్మన్ జీఎస్‌‌‌‌కే వేలు ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వినూత్న టెక్నాలజీని ప్రవేశపెట్టిన తొలి కార్పొరేట్ కంటి వైద్య సంస్థగా మ్యాక్సివిజన్ గుర్తింపు పొందింది. ఈ నెక్స్ట్ జనరేషన్ లేజర్ సర్జరీ ద్వారా కార్నియాపై పెద్ద కోతలు లేకుండా కేవలం 10 సెకన్లలోపే చికిత్స పూర్తవుతుంది. దీనివల్ల రోగులు అతి త్వరగా కోలుకోవచ్చు. మయోపియా, ఆస్టిగ్మాటిజం వంటి దృష్టి లోపాలతో బాధపడేవారికి స్మైల్​ ప్రో ఎంతో మేలు చేస్తుంది.