ఏపీ ఎన్నికలు: ఈ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కౌంటింగ్ వాయిదా

ఏపీ ఎన్నికలు: ఈ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కౌంటింగ్ వాయిదా

అమరావతి: ఏపీని వణికిస్తోన్న మురుసు తుపాన్ ప్రభావం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‎పై పడింది. మురుసు తుపాన్ ఎపెక్ట్‎తో ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ వాయిదా పడింది. ఓట్ల లెక్కింపు వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. 

2026, నవంబర్ 1 కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగాలి. కానీ మురసు తుపాను ప్రభావంతో ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 

మురుసు తుపాను ప్రభావంతో భారీ వర్షం, బలమైన ఈదురు గాలులు వీడయంతో ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థానాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ షెడ్యూల్ ప్రకారం మంగళవారం (నవంబర్ 3) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన పులివెందుల మున్సిపాలిటీ ఎన్నిక కూడా జరుగుతోంది. పులివెందుల మున్సిపాలిటీలో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‎ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పులివెందుల మున్సిపాలిటి కౌంటింగ్‎కు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతోన్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమి ఆధిక్యంలో ఉంది.