రైతులకు గుడ్ న్యూస్: పప్పు దినుసుల మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌

రైతులకు గుడ్ న్యూస్:  పప్పు దినుసుల మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌
  • ఫ్యాక్స్​ చైర్మన్​ ఇప్ప శ్రీనివాస్​రెడ్డి

చొప్పదండి, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి వనరులు, విద్యుత్‌‌‌‌‌‌‌‌ను పొదుపుగా వినియోగించేలా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నట్లు ఫ్యాక్స్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఇప్ప శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. 

కంది, పెసర, బబ్బెర, శనగ, మినుములు వంటి అపరాలను ప్రభుత్వ మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌తో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. సోమవారం సహకార సంఘ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీ పరిధిలో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారని, చివరి దశలో నీరు అందక దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. 

వరికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు పండించిన అపరాలను సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ అనంతరం తక్కువ ధరకు నాణ్యమైన పప్పుదినుసులుగా అందించేందుకు దాల్‌‌‌‌‌‌‌‌ మిల్లును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నిజానపురం చందు, సీఈవో తిరుపతిరెడ్డి, ఏవో అంజిత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్లు, ఏఈవోలు పాల్గొన్నారు.