జ్యోతిష్య శాస్త్ర ప్రకారం... సంపద.. ఐశ్వర్యానికి కారణమైన శుక్రుడు ఈ ఏడాది (2026) నవంబర్ 6 వ తేదీన ( అర్ధరాత్రి 12:45 గంటలకు) స్థానాన్ని మార్చుకుంటాడు. శుక్రుడు కన్యరాశిలోకి మారడం వలన సింహం, కన్య, వృశ్చికం, ధనస్సు రాశుల వారికి అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఇప్పుడు ఈ రాశుల వివరాలతో మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సుఖ సంతోషాలకు, సిరిసంపదలకు కారకుడిగా పరిగణిస్తారు. శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. శుక్రుడికి కన్యా రాశి నీచ స్థానమే కాక, మిత్ర క్షేత్రం కూడా. శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కొన్ని రాశుల వారు శుక్రుడి కారకత్వాలకు అనుగుణంగా వ్యవహరించడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
మేషరాశి: కన్యారాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు లేదా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో ఆవేశ పడకుండా ఆచితూచి నిర్ణయం తీపుకోండి. తొందరపాటు చర్యల వలన తప్పటడుడు వేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులు బాగా కష్ట పడాల్సి వస్తుంది. ఆర్ధికంగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో నిర్ణయాలను వాయిదా వేయండి
వృషభరాశి: ఈ రాశి వారికి కన్యారాశిలో శుక్రుడి సంచారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.
వృత్తి పరంగా కొంత శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. చేపట్టే కొత్త పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. పనిభారం అధికమవుతుంది. ఆర్థిక విషయాల్లో మిత్రులు మోసగించే అవకాశం ఉంది. రావలసిన డబ్బు కొద్దిగా మాత్రమే చేతికందుతుంది. వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి. ప్రతి పని కూడా కష్టపడితే గాని పూర్తి కాదు. ఆస్తివివాదాలు.. కోర్టు కేసుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమ విషయాల్లో స్పష్టమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథునరాశి: శుక్రుడు కన్యా రాశిలోకి సంచరించే సమయంలో ఈ రాశి వారికి జ్యోతిష్య పరంగా కొన్ని ముఖ్యమైన ప్రభావాలు ఉంటాయి. ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి అడుగువేయాలి. వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చేసే పనుల్లో ఆటంకంతో పాటు పురోభివృద్ది ఉండకపోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఆర్థిక పరంగా కొద్దిపాటి చిక్కులు ఉన్నా.. సకాలంలో చేతికి డబ్బు అందుతుంది. డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. జీవితభాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
కర్కాటకరాశి: కన్యారాశిలో శుక్రుని సంచారం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ పనులన్నింటినీ క్రమ పద్ధతిలో పూర్తి చేస్తారు. మీరు పాత పథకాల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. మీరు కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు మెరుగైన లాభాలను పొందుతారు. వృత్తి , వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది, ప్రేమ యాత్రలు, విహార యాత్రలు చోటు చేసుకుంటాయి. విలువైన కానుకలు కొనిపెట్టడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.
సింహరాశి: శుక్రుడు కన్యారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడి పెట్టడం వలన అధికంగా లాభాలు వస్తాయి. శుక్రుడి శుభ ప్రభావం వల్ల జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది. సౌలభ్యం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో డబ్బు సంపాదన పెరగడం వల్ల వ్యాపారం బాగుంటుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి మరియు కుటుంబ జీవితం మెరుగుపడుతుంది.
కన్యారాశి: ఇదే రాశిలో శుక్రుడి సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని విజయాన్ని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆకస్మిక విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. భౌతిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారంలో మెరుగుదల, పురోగతి మార్గంలో ముందుకు సాగుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం కూడా లభిస్తుంది.. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడం వల్ల సంపన్నులయ్యే అవకాశం ఉంది.
తులారాశి: శుక్రుడు.. కన్యారాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. స్థాన చలనం.. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
వృశ్చికరాశి: శుక్రుడు ... కన్యారాశిలోకి ప్రవేశించిన తరువాత ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రేమ జీవితంలో కూడా పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. దీనితో పాటు, మీరు మీ సహోద్యోగులతో బాగా కలిసిపోతారు. సీనియర్ అధికారుల సహకారంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దీంతో పాటు కెరీర్‌లో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడం ద్వారా ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
ధనస్సురాశి: కన్యారాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి బాగుటుంది. ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.
మకరరాశి: శుక్రుడు స్థానచలనం వలన ఈరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో అనుకోకుండా ప్రశంసలుఅందుకుంటారు. కేరీర్ విషయంలో ఊహించనంత అభివృద్ది ఉంటుంది. పూర్వీకుల ఆస్థి కలసి రావడంతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు గడ్ న్యూస్ అందుతుంది. విదేశాలకు వెళ్లాలన్న మీ డ్రీమ్ నెరవేరుతోంది. వైవాహిక జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోవడంతో చాలా ఆనందంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి: కన్యా రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం, వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, గతంలో నిలిచిపోయిన ధనం చేతికి అందుతుంది.జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఊహించని ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొత్త గాపెట్టుబులు పెట్టేవారికి భారీగా లాభాలు వస్తాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. ఒక్కసారిగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మొదలు పెట్టే ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఊహించని విధంగా డబ్బు పెరిగే అవకాశాల కూడా ఉన్నాయి.
మీనరాశి: శుక్రుడు కన్యారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలె తీసుకోవాలి. ఆస్తి సమస్యలు.. కొన్ని వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ రాశి వారికి క్షణం తీరిక లేదు.. పైసా ఆదాయం లేదు అన్న విధంగా ఉంటుంది. ప్రతి పనిలో జరిగే ఆలస్యం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. దైవ చింతన చేస్తూ అనుకున్న పనులను మీ షెడ్యూల్ ప్రకారం చేయండి. ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
