నా చావుకు అత్తనే కారణం మెసేజ్లు పంపి ప్రముఖ వ్యాపారవేత్త కోడలు ఆత్మహత్య !

నా చావుకు అత్తనే కారణం మెసేజ్లు పంపి ప్రముఖ వ్యాపారవేత్త కోడలు ఆత్మహత్య !

పుణెకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కోడలైన 29 ఏళ్ల మహిళ, సోమవారం ఉదయం ముకుంద్ నగర్‌లోని ఒక ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. అత్తతో జరిగిన గొడవనే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. తన చావుకు అత్తనే కారణం అని తన సన్నిహితుల్లో కొందరికి ఆమె మెసేజ్ లు పంపి చనిపోయినట్లు సమాచారం.

భారీగా కట్నం ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ తన తల్లిదండ్రులను బంగారం కావాలని డిమాండ్ చేస్తుండటం, ఈ విషయమై తనను ఇబ్బంది పెట్టడంతో ఆమె ప్రాణం తీసుకుందని బాధిత మహిళ కుటుంబం ఆరోపించింది.

పోలీసులు ఆమె భర్తను, ఆమె అత్తమామలపై అరెస్ట్ చేశారు. వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. బాధితురాలిని పాయల్ జంబ్రే పాటిల్ ఐటీ నిపుణురాలుగా పనిచేసేవారు. ఆమెకు అక్షయ్ జంబ్రే పాటిల్‌తో వివాహం జరిగింది, ఈ దంపతులకు మూడేళ్ల పాప కూడా ఉంది.

ఈ ఘటనపై స్వర్గేట్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ యశ్వంత్ నికమ్ మాట్లాడుతూ.. పాయల్ పూణే-సతారా రోడ్డు సమీపంలోని ముకుంద్ నగర్‌లో తన అత్తమామలతో కలిసి నివసించేదని చెప్పారు. సోమవారం ఉదయం.. తనకు ఏమైనా జరిగితే దానికి తన అత్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆమె కొంతమందికి మెసేజ్లు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆదివారం పాయల్కు, తన అత్తకు మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత అత్తగారింటి నుంచి పాయల్ వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు, అత్తమామలు ఆమె కోసం వెతుకులాట సాగించారు. చివరకు, వారి ఇంటికి దగ్గరలోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని వేరొక ఫ్లాట్‌లో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది.