దీపావళి పండుగ... క్రాకర్స్ ఫెస్టివల్.. సైన్స్ చెబుతున్న సైంటిఫిక్ రీజన్ ఇదే...

దీపావళి పండుగ...  క్రాకర్స్ ఫెస్టివల్.. సైన్స్ చెబుతున్న సైంటిఫిక్ రీజన్ ఇదే...

హిందువులు జరుపుకొనే ప్రతి పండుగకు ఆధ్యాత్మికతో పాటు సైంటిఫిక్​ రీజన్​ ఉంటుంది. ప్రతి పండుగకు  పురాణగాథ... మరో పక్క శాస్త్రీయ కోణం రెండూ ఉంటాయి.  అయితే ఎవరి వాదన వారు వాదిస్తుంటారు.  మనము ఎవరినీ తప్పుపట్ట లేము కానీ... రెండు విషయాలను భావితరాలకు అందించాల్సిన అవసరముంది.  దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చడం... దీపాలు వెలిగించడం... వస్తున్న ఆచారం.  అయితే దీనికి శాస్త్రీయ కోణం పరంగా శాస్త్రవేత్తలు  ఏం చెబుతున్నారో ఒకసారి  తెలుసుకుందాం. . . .!

హిందువుల జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి  ఒకటి. ఈ పండుగకు శాస్త్రీయ కోణంలో చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం  తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి.. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. ఈ ఏడాది వర్షాలు పడకపోయినా సీజనల్​  వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యానికి గురువుతారు.

శీతకాలం  ఆరంభం కావడంతో కాలానుగుణంగా వచ్చే వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు  వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దానిలో పడి చనిపోతాయి. దీపావళి రోజు కాల్చే టపాసులు, మతాబుల నుంచి వెలువడే పొగ దోమలు వంటి క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది. దీంతో విద్యుదయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి. ఫలితంగా రక్తకణాలు ఉత్తేజితమై వ్యాధినిరోధకత పెరుగుతుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వల్ల సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. ఆవు నెయ్యి దీపాల నుంచి వచ్చే పొగ వాతావారణాన్ని మెరుగుపరుస్తుంది. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది.

జ్యోతిష్య సిద్దాంతం ప్రకారం ఆవు నేతితో దీపం వెలిగిస్తే దాని పొగ ఇంట్లో నెగెటివిటీని తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. దీపం ఆరిపోయిన తర్వాత సుమారు నాలుగు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా చీకటి మాయమై వెలుగులు ప్రసరిస్తాయి.

కానీ, దురదృష్టవశాత్తూ ఇటీవల గ్లోబల్ వార్మింగ్ లేదా వాతావరణ మార్పు వంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. గాలి, నీరు, నేల కాలుష్యంతో ముడిపడి ఉన్న ఈ యుగంలో సహజ సిద్ధంగా బ్యాక్టీరియా ఉత్పరివర్తనాలను నాశనం చేసే దీపపు మంటల ప్రభావం బలహీనపడింది.