దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతున్న సమయం అది. అప్పటికింకా క్షీరసాగర మథనం జరగలేదు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగే భయంకర యుద్ధంలో ఎందరో సైనికులు మరణించేవాళ్లు. అయితే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి, మృత సంజీవని విద్యను సంపాదించాడు. ఈ విద్య ద్వారా యుద్ధంలో మరణించిన రాక్షసులను, శుక్రుడు తిరిగి బతికించేవాడు. మళ్లీ ప్రాణం పోసుకున్న రాక్షసులు, తిరిగి దేవతలపై యుద్ధం చేసేవాళ్లు.
రాక్షసులు అదే సంఖ్యలో యుద్ధం చేస్తుండటంతో, దేవతలకు ఎంత శక్తి ఉన్నా సరిపోయేది కాదు. వాళ్ల శక్తి మెల్లిగా తగ్గిపోతున్నట్లు కనిపించింది. మంచి ఓడిపోవడం ఇష్టంలేని, దేవతల గురువు బృహస్పతి ఎలాగైనా వాళ్లను గెలిపించాలనుకున్నాడు.
దీనికి ఒక ఉపాయం ఆలోచించిన బృహస్పతి, తన కుమారుడైన కచుని పిలిచి.. 'రాక్షసుల గురువైన శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లి, శిష్యరికం చేసి, మృత సంజీవని విద్యను నేర్చుకుని రా' అని ఆదేశించాడు. రాక్షసుల దగ్గరకు తన కుమారుడ్ని పంపడం ప్రమాదమని తెలిసి కూడా ధర్మ సంస్థాపన కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు బృహస్పతి.
తండ్రిమాటను శిరసావహించేవాడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రా చార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి "గురుభ్యోనమః స్వామీ నేను ఆంగీరస గోత్ర జాతుడను. దేవగురువులైన బృహస్పతులవారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. మీవద్ద శిష్యరికం చేసేందుకు విద్యార్థినై వచ్చాను" అని ప్రార్థించాడు.
కచుని వినయానికి సంతోషించిన శుక్రుడు "నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు నీవంటి అర్హుడిని శిష్యుడిగా స్వీకరించుట నాకు సంతోషకరం" అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నా డు. కచుడు రోజూ సూర్యోదయానికి ముందే లేచి స్నానాది క్రియలు నిర్వహించి, సంధ్యావందనాది ఆహ్నికాలు చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠ పాటిస్తూ ఎంతో ప్రీతితో గురువైన శుక్రాచార్యుడికి సేవ చేసేవాడు.
గురువు దగ్గర వినయవిధేయతలతో ఉంటూ, భక్తి, ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు నేర్చుకునేవాడు. శుక్రుడికి దేవయాని అనే కుమార్తె ఉండేది. ఆమె అతి సౌందర్యవతి. కచుడిపై మనసుపడింది. కచుడికి ఉన్న వినయ విధేయత, సంస్కారం వంటివి ఆమెను, కచుడిని ఇష్టపడేలా చేశాయి. కానీ, కచుడు దేవయానిని సరిగ్గా చూసేవాడు కూడా కాదు. గురుపుత్రి కావడంతో సోదరిగా భావించేవాడు.
దివ్యదృష్టితో
కచుని జ్ఞానం, మంచితనం వంటివి చూసిన మిగతా శిష్యులైన రాక్షసులు అసూయతో రగి లిపోయారు. ఒకరోజు అందరూ సమావేశమై "కచుడు మన శత్రువుల పక్షము. అతడు మృత సంజీవని విద్య నేర్చుకుంటే, అది మనకు హాని చేస్తుంది. కాబట్టి, ఆ విద్య నేర్చుకోకముందే అతడ్ని చంపేద్దాం" అని నిర్ణయించుకున్నారు. శుక్రుడికి చెందిన గోవులను కాచి, అడవి నుంచి ఆశ్రమానికి తిరిగొస్తున్న కచుడుని దారుణంగా చంపేశారు.
కచుడు ఇంటికి రాకపోవడంతో, ఆందోళనకు గురైన దేవయాని తండ్రితో... "నాన్నా! ఇంత ఆలస్యమైనా కచుడు ఈరోజు ఇంకా ఇంటికి తిరిగిరాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుడి గురించి తెలుసుకోండి" అని కోరింది. శుక్రుడు, తన దివ్యదృష్టితో జరిగింది తెలుసు కున్నాడు. వెంటనే తన మృత సంజీవని విద్యతో కచుడ్ని బతికించాడు.
కచుడిపై ద్వేషంతో ఉన్న రాక్షసులకు ఈ పరిణామం మరింత కోపం తెప్పించింది. ఈసారి కచుడ్ని చంపితే, తిరిగి బతికించేలా ఉండకూడదనుకున్నారు. మళ్లీ కచుడ్ని చంపి, దేహాన్ని కాల్చి బూడిద చేసి, దాన్ని మధిర (సురాపానం)లో కలిపివినయంగా శుక్రుడికి అందించారు రాక్షసులు.
శుక్రుడికి, ఆ విషయం తెలియక మధిరపానం చేశాడు. ఆ రోజు కూడా కచుడు ఇంటికి రాకపో యేసరికి, దేవయాని మళ్లీ తన గురించి తెలుసు కోమని ప్రార్ధించింది. వెంటనే తన దివ్యదృష్టితో, రాక్షసులు చేసిన పని తెలుసుకుని, ఎంతో బాధప డ్డాడు శుక్రుడు. "ఈ రాక్షసులు ఎంత పనిచేశారు. తెలియకుండా నేను కూడా తప్పు చేశాను. ఈ మధిరపానము మత్తు వల్ల నా వివేకం నశించింది.
ఇకపై ఇలాంటి తప్పులు చేయను. మధిరపానము చేయను. తెలియక చేసిన ఈ తప్పును సరిదిద్దు కుంటాను" అనుకున్నాడు శుక్రుడు. వెంటనే తన కడుపులో, సూక్ష్మ రూపంలో ఉన్న కచునికి మృత సంజీవని విద్య నేర్పాలనుకున్నాడు. "ఈ విద్య నేర్చుకున్న కచుడు నా పొట్ట చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆ విద్యతో నన్ను బతికిస్తాడు" అనుకొని అలాగే చేశాడు.
శుక్రుడి పొట్ట నుంచి బయటకు వచ్చిన కచుడు. తిరిగి ఆ విద్యద్వారా గురువును బతికించుకున్నాడు. అప్పటికే అన్ని విద్యలు పూర్తి చేసుకుని, మృత సంజీవని విద్య కూడా నేర్చుకున్న కచుడు, శుక్రుడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పుడే దేవయాని, కచుడితో తన ప్రేమను తెలి యజెప్పింది. తనను పెళ్లి చేసుకోమని నిర్బంధించింది.
అప్పుడు కచుడు.. 'సోదరీ! నీవు నా గురుపుత్రికవు. కాబట్టి, నాకు సోదరితో సమానం. నీకునాపై అలాంటి ప్రేమ పుట్టకూడదు. అది ఆధర్మం"అన్నాడు. దీంతో కచుడిపై కోపం తెచ్చుకున్నదేవయాని, "నన్ను బాధపెట్టిన కారణంగా నీవునేర్చుకున్న విద్య నీకు ఉపయోగపడదు" అనిశపించింది. అప్పుడు దేవయానికి కచుడు. “చెల్లీ!
విద్య ఎన్నటికీ ఉపయోగపడకుండా పోదు. నాకుపనికిరాకున్నా. అర్హులైన ఇతరులకు నేర్పి వాళ్లకు ఉపయోగపడేలా చేస్తాను. సమాజశ్రేయస్సుకోసం ఉపయోగపడటంకన్నా విద్యకు పరమార్ధం
ఏముంటుంది" అని సమాధానమిచ్చాడు.ఈ కథ ఎన్నో నీతుల్ని బోధిస్తోంది. ధర్మాన్నికాపాడేందుకు తన కొడుకు ప్రాణాల్ని సైతంపణంగా పెట్టిన బృహస్పతి త్యాగం వెలకట్టలేనిది.శత్రువు కొడుకు అని తెలిసినా, విద్య నేర్పేందుకు అంగీకరించిన శుక్రుడి గురునీతి గొప్పది.
తనకు గురువు శత్రువైనా ఒక శిష్యుడిగా పూర్తి వినయవిధేయతలు, భక్తి శ్రద్దలు చూపి శిష్యుడికి
ఉండాల్సిన లక్షణాలేంటో చెప్పాడు కచుడు, విద్య నేర్చుకునేటప్పుడు దృష్టి ఇతర అంశాలమీద ఉండకూడదనే విషయం కూడా ఇందులో ఉంది. విద్యసమాజానికి ఉపయోగపడాలనే నిగూఢార్ధాన్ని
కూడా బోధిస్తుంది ఈ కథ.
