Bigg Boss Telugu 10: పెయిడ్ రివ్యూలంటూ ప్రియాంక జైన్ ఆరోపణలు.. ఆది రెడ్డి మాస్ కౌంటర్!

Bigg Boss Telugu 10: పెయిడ్ రివ్యూలంటూ ప్రియాంక జైన్ ఆరోపణలు.. ఆది రెడ్డి మాస్ కౌంటర్!

బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, గేమ్స్, భావోద్వేగాలు ఒక ఎత్తయితే.. బయట మాజీ కంటెస్టెంట్లు, రివ్యూయర్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరో ఎత్తుగా మారింది. లేటెస్ట్ గా3 నటి ప్రియాంక జైన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆది రెడ్డి మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. పెయిడ్ రివ్యూలు, పక్షపాత ధోరణి అంటూ ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

ప్రియాంక జైన్ కాబోయే భర్త శివ కుమార్ బిగ్‌బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రియాంక స్పందిస్తూ రివ్యూయర్ల తీరును ప్రశ్నించారు. ముఖ్యంగా ఎలిమినేట్ అయిన రోహిత్, అతడి గ్రూప్ ఉపయోగించిన అభ్యంతరకరమైన భాషను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తమకు నచ్చిన కంటెస్టెంట్లను కాపాడుకోవడం కోసమే కొందరు రివ్యూయర్లు కొన్ని విషయాలను పట్టించుకోవడం లేదు. పెయిడ్ రివ్యూలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆమె టార్గెట్ చేసింది ఆది రెడ్డినే అంటూ నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు.

 

ఈ విమర్శలపై ఆది రెడ్డి కూడా పరోక్షంగా ఘాటుగానే స్పందించారు. తాను తన రివ్యూల్లో చెడు భాషను ప్రస్తావించానని, అయితే అది కొందరు ఆశించిన విధంగా లేదని స్పష్టం చేశారు. శివ కుమార్ గేమ్‌పైనా తాను అనవసరంగా విమర్శలు చేయలేదు. హౌస్‌లో జరిగిన విషయాలను ఆయన బయటపెట్టడాన్ని కూడా తప్పుబట్టలేదని వివరించారు. 

►ALSO READ | నవంబర్ 4న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న అనిష్, అనస్వర రాజన్ మూవీ

రివ్యూయర్లు కంటెస్టెంట్ల అభిరుచులకు తగ్గట్టుగా అభిప్రాయాలు చెప్పాలా? నచ్చకపోతే ఎవరైనా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించుకోవచ్చంటూ కౌంటర్ ఇచ్చారు. మాజీ కంటెస్టెంట్లు విమర్శలను స్వీకరించడం నేర్చుకోవాలని కూడా హితవు పలికారు. దీంతో బిగ్‌బాస్ హౌస్ బయట మరో వార్ మొదలైనట్లయింది. మరి ఈ మాటల యుద్ధానికి ప్రియాంక నుంచి మరో కౌంటర్ వస్తుందా? లేక ఇక్కడితో వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది..