Shubman Gill: న్యూజిలాండ్‌తో రేపు (2026, నవంబర్ 4, బుధవారం) నుంచి ప్రారంభం కానున్న తొలి వన్డే నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) జట్టు బ్యాటింగ్ ఆర్డర్, ప్లేయింగ్ ఎలెవన్ కూర్పుపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. తొలి వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గిల్.. భారత జట్టు వ్యూహాలతో పాటు తన ఫిట్‌నెస్‌పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ సిరీస్‌లోని తొలి మూడు వన్డేలకు మాత్రమే గిల్ సారథ్యం వహించనుండగా, ఆ తర్వాత జరగబోయే సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు సిద్ధం కానున్నాడు. కాగా, మిగిలిన నాలుగు, ఐదో వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
టాప్-4 వాళ్లే.. 5, 6 స్థానాల్లో ఫ్లెక్సిబుల్ విధానం:
తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్ గురించి శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తొలి నాలుగు స్థానాల్లో నేను, రోహిత్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వస్తాం.. అయితే 5, 6 స్థానాల విషయంలో మాత్రం మేము పరిస్థితులకు తగ్గట్లుగా మారే 'ఫ్లెక్సిబుల్ విధానాన్ని' అనుసరించాలనుకుంటున్నాం.. మా టాప్-4 బ్యాటర్లు అందరూ కుడిచేతి వాటం ఆటగాళ్లే. కాబట్టి ప్రత్యర్థి బౌలింగ్‌ను దెబ్బ తీసేందుకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అవసరమైతే అక్షర్ పటేల్ ముందుకు వస్తాడు. అలాగే మ్యాచ్ పరిస్థితులను బట్టి కేఎల్ రాహుల్ కూడా ముందుగా బ్యాటింగ్‌కు రావొచ్చని గిల్ వివరించాడు.
మెడ నొప్పితో ఫిట్‌నెస్ సమస్య: గిల్ రియాక్షన్
తన మెడ నొప్పితో పాటు ఫిట్‌నెస్‌పై వస్తున్న వార్తలకు శుభ్‌మన్ గిల్ చెక్ పెట్టాడు. నా ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదు.. ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశా, ఫీల్డింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రమించానని పేర్కొన్నాడు.
►ALSO READ | 34 వేల సీట్లు.. 84 లక్షల టికెట్ రిక్వెస్టులు.. భారత్ vs పాక్ మ్యాచ్‌కు భారీ క్రేజ్!
పాండ్యా లేకపోవడం జట్టు బ్యాటింగ్ పై ఎఫెక్ట్:
హార్దిక్ పాండ్యా లేకపోవడంతో లోయర్ ఆర్డర్ బలహీనపడిందన్న ప్రశ్నకు గిల్ స్పందిస్తూ.. నిజమే, గాయం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరం కావడం జట్టు సమతుల్యతను (Team Balance) కొంత వరకు దెబ్బతీసింది. పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వస్తే మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పూర్తిగా కుదురుకుంటాయి. దాంతో ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్న బ్యాటింగ్ సమస్యలు కూడా తొలగిపోతాయని స్పష్టం చేశాడు.
Shubman Gill said - "We will have floating approach for no.5 and no.6. Our top four is set, all right-handers. So if lefty is needed, Axar bhai goes and depending on match situation even KL bhai can go. So bit flexible". (Sahil Malhotra). https://t.co/R97IEnyWbs
— Tanuj (@ImTanujSingh) November 3, 2026
