IND vs NZ 1st ODI: న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్‌ను 3–2 తేడాతో గెలుచుకుని జోరుమీదున్న టీమిండియా, ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది! కివీస్ తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే రేపు (బుధవారం, నవంబర్ 4, 2026) ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ (Eden Park) వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత్ పవర్ పుల్ బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే సెటప్‌లోకి తిరిగి వస్తుండగా, తొలి 3 వన్డేలకు యంగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా మ్యాచ్ ని టీవీలో, మొబైల్ లో లైవ్ ఎక్కడ చూడాలి అనేది ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో ఒక్కసారి చూద్దాం..
మ్యాచ్ జరిగే సమయం:
* తొలి వన్డే తేదీ: నవంబర్ 4, 2026 (బుధవారం)
* టాస్ సమయం: ఉదయం 7:00 గంటలకు (IST)
* మ్యాచ్ ప్రారంభం: ఉదయం 7:30 గంటలకు (IST)
* వేదిక: ఈడెన్ పార్క్, ఆక్లాండ్
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే?:
* ఈ మ్యాచ్‌ను భారత్‌లోని క్రికెట్ అభిమానులు లైవ్‌లో ఎక్కడ చూడవచ్చో ఇక్కడ వివరంగా ఇచ్చాం:
* టీవీ ఛానెల్స్ (TV Broadcast): టీవీలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) ఛానెళ్లలో చూడవచ్చు.
* మొబైల్ / ఓటీటీ స్ట్రీమింగ్ (Live Streaming): స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్ టీవీల్లో లైవ్ చూడాలనుకునే వారు SonyLIV (సోనీ లివ్) యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ పొందవచ్చు. (గమనిక: దీనికి యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ అవసరం).
భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్:
* 1వ వన్డే: నవంబర్ 4 (ఆక్లాండ్)
* 2వ వన్డే: నవంబర్ 7 (వెల్లింగ్టన్)
* 3వ వన్డే: నవంబర్ 10 (హమిల్టన్)
* 4వ వన్డే: నవంబర్ 13 (మౌంట్ మావుంగనుయ్)
* 5వ వన్డే: నవంబర్ 15 (మౌంట్ మావుంగనుయ్)
One Day cricket returns! 🙌 The five-match Hero VIDA ODI Series, Powered by Nova Ai+ Smartphone starts tomorrow at Eden Park! Buy tickets at https://t.co/pLy38Oh8fE 🎟️ #NZvIND https://t.co/nk373oVE55
— BLACKCAPS (@BLACKCAPS) November 2, 2026
