క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్–ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్‌లో ఇండియా–ఎ బౌలర్లు మహ్మద్ సిరాజ్ (4/118), ముకేశ్ కుమార్ (5/87) బౌలింగ్‌లో రాణించినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించలేకపోయారు. మాథ్యూ బోలీ (110), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (93) చెలరేగడంతో.. 218/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 132.5 ఓవర్లలో 424 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో 78 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
క్రిస్టియాన్ క్లార్క్ (41), ఫ్రెజర్ షీట్ (40), మిచెల్ హే (31), జైడెన్ లెనాక్స్ (32 నాటౌట్), జారోడ్ మెక్‌కే (33) ఆకట్టుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా–ఎ జట్టు ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 32/0 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (20 బ్యాటింగ్), సాయి సుదర్శన్ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా ఇంకా 46 రన్స్ వెనకబడి ఉంది.
