సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్‌తో సోమవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–బి మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ అనుజ్ తివారీ (72), వికల్ప్ తివారీ (69) హాఫ్ సెంచరీలు సాధించడంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 279/7 స్కోరు చేసింది. జయంత్ యాదవ్ (36 బ్యాటింగ్), అజయ్ మండల్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
స్టార్టింగ్‌లో హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో ఆయుష్ పాండే (17), సంజీత్ దేశాయ్ (0), అమన్‌దీప్ ఖరే (0) నిరాశపర్చారు. మయాంక్ వర్మ (36) ఫర్వాలేదనిపించినా.. చత్తీస్‌గఢ్ 94/4తో నిలిచింది. ఈ దశలో అనుజ్ వికల్ప్ ఐదో వికెట్‌కు 93 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో జయంత్, ప్రతీక్ యాదవ్ (27) రాణించడంతో చత్తీస్‌గఢ్ మంచి స్కోరు చేసింది. రక్షణ్ రెడ్డి, అనికేత్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు.
