హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (జీఐఆర్ఐ) పేరుతో పనిచేస్తున్న డాక్టర్ రవీంద్రనాథ్ కంచెర్ల నేతృత్వంలోని గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ జీయూఎఫ్ జపాన్‌కు చెందిన ది సిస్టమ్స్ బయాలజీ ఇన్స్టిట్యూట్ (ఎస్బీఐ) తో వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ నెల ఒకటో తేదీన ఎస్బీఐ ప్రెసిడెంట్ డాక్టర్ హిరోకి కితానో హైదరాబాద్ పర్యటనలో దీనిపై అధికారికంగా సంతకాలు చేశారు. హైదరాబాద్‌లో ఒక సమగ్ర ఆరోగ్య, విద్యా వ్యవస్థను నిర్మించాలనే జీయూఎఫ్ లక్ష్యానికి ఇది ఊతం ఇస్తుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశోధనల కోసం డాక్టర్ రవీంద్రనాథ్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి 250 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించారు.
