టెక్ రంగంలో అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 5 వేల ఉద్యోగాల కోత

టెక్ రంగంలో అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో 5 వేల ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు మొగ్గు చూపడం, రీస్ట్రక్చరింగ్‌‌‌‌ కారణాలతో పెద్ద టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా 5,191 మంది టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. నెట్‌‌‌‌ఫ్లిక్స్ 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ–కామర్స్ కంపెనీ ఈబే సుమారు 1,100 మందిని తీసేయగా,  అమెజాన్ రిటైల్ స్టోర్స్, అలెక్సా డివైసెస్ విభాగాల్లో పలు విడతల్లో ఉద్యోగాలకు కోత విధించింది.