గేమింగ్ రంగంలోకి మహేష్ బాబు.. షార్ట్‌‌‌‌గన్ గేమ్స్ లో పెట్టుబడులు

గేమింగ్ రంగంలోకి మహేష్ బాబు.. షార్ట్‌‌‌‌గన్ గేమ్స్ లో పెట్టుబడులు

హైదరాబాద్​, వెలుగు: నటుడు మహేష్ బాబు అంతర్జాతీయ గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబై కేంద్రంగా పనిచేసే షార్ట్‌‌‌‌గన్ గేమ్స్ సంస్థలో ఆయన వ్యూహాత్మక పెట్టుబడిదారుగా చేరారు. సంస్థ సహ–వ్యవస్థాపకులు జీత్ చందన్, విధిత్ మెహతాతో కలిసి ప్రపంచస్థాయి పీసీ, కన్సోల్ గేమ్స్‌‌‌‌ను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

వీళ్లు టేక్‌‌‌‌డౌన్ జెనెసిస్ పేరుతో భారీ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌‌‌‌ను అంతర్జాతీయ మార్కెట్ కోసం అభివృద్ధి చేస్తున్నారు. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌‌‌‌బాక్స్ సిరీస్ ఎక్స్ ఎస్ లాంటి ఆధునిక ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లతో పాటు పీసీలపై కూడా ఇది అందుబాటులోకి రానుంది.