నవంబర్ 4న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న అనిష్, అనస్వర రాజన్ మూవీ

 నవంబర్ 4న ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ విడుదల.. ఆసక్తి రేపుతున్న అనిష్, అనస్వర రాజన్ మూవీ

అనీష్, అనస్వర రాజన్ జంటగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. నాగార్జున సమర్పణలో   మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నవంబర్ 13న సినిమా విడుదల  కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌డేట్ అందించారు మేకర్స్.  నవంబర్ 4న   ట్రైలర్‌‌‌‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.  

ఇందులో  అర్జున్ అనే మూగ యువకుడిగా అనీష్ కనిపించనున్నాడు.  అర్జున్ తన జీవితమంతా కీర్తిని (అనస్వర)  మౌనంగా ప్రేమిస్తుంటాడు. అతని ప్రయాణం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ప్రేమ, హాస్యం, సాహసం, ఊహించని ట్విస్టులతో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని  ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.