నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు ‘సమ్మర్ హాలిడేస్’.. భావోద్వేగాలు, చిరునవ్వులు పంచే బాలల చిత్రం

నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు ‘సమ్మర్ హాలిడేస్’.. భావోద్వేగాలు, చిరునవ్వులు పంచే బాలల చిత్రం

మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో శ్రీకర్ నయన్ దర్శకత్వంలో  ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకర్ నయన్ మాట్లాడుతూ ‘రెండు భిన్నమైన ప్రపంచాలకు చెందిన పిల్లలు వేసవి సెలవుల్లో స్నేహితులైతే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమాను  రూపొందించాం. - మొదట ఈ సినిమాకు ‘సమ్మర్ ఫ్రెండ్’  అనే టైటిల్ అనుకున్నాం.  అమ్మమ్మ ఊరు, క్రికెట్ ఆటలు, తాటిముంజలు, కొత్త స్నేహాలు, అమ్మమ్మ చెప్పే కబుర్లు.. ఇలా మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి.  ఇది కేవలం పిల్లల సినిమా కాదు.. పిల్లలు నటించిన పెద్దల సినిమా. అందరినీ అలరించే అవుట్‌‌‌‌‌‌‌‌ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. అరుణ్ అమ్మమ్మ పాత్రలో జయసుధ  నటించారు. ఆమె పాత్రను  ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. వాసుకి కూడా కీలక పాత్ర పోషించారు.  

సినిమాలోని సందేశంతో పాటు క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌లో వచ్చే బలమైన డైలాగ్స్ ఆమె పాత్ర ద్వారానే ఉంటాయి.  హర్షిణి, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్  పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  పిల్లలతో సినిమా చేయడం కోసం ప్రత్యేకంగా వర్క్‌‌‌‌‌‌‌‌షాప్స్ నిర్వహించాం.

రోహన్, అరుణ్ ప్రధాన పాత్రలకు ఎంపిక కాగా, ట్రైలర్ చూసిన తర్వాత ఖుషిని తీసుకున్నాం. వీరితోపాటు దాదాపు  వందమంది పిల్లలతో షూటింగ్ చేయడం మాత్రం కొంచెం సవాలుగా అనిపించింది. వరుస యాక్షన్, హింసాత్మక చిత్రాలతో ప్రేక్షకులు విసుగు చెందారు.  ఇలాంటి సమయంలో 'సమ్మర్ హాలిడేస్' మంచి ఎమోషన్‌‌‌‌‌‌‌‌ను పంచుతూ  ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు తీసుకొచ్చే సినిమా అవుతుంది’  అని చెప్పారు.