10 రోజుల్లో మరో తుఫాన్ వస్తుంది : ఏపీని వణికిస్తున్న వరస విపత్తులు

10 రోజుల్లో మరో తుఫాన్ వస్తుంది : ఏపీని వణికిస్తున్న వరస విపత్తులు

జస్ట్.. ఇప్పుడే.. కొన్ని గంటల ముందే మురస తుఫాన్ తీరం దాటింది. ఒంగోలు దగ్గర 120 కిలోమీటర్ల వేగంతో.. తీవ్ర తుఫాన్ గా తీరం దాటి.. విధ్వంసం సృష్టించింది. ఈదురుగాలులకు చెట్లు కూలాయి. కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షంతో జలమయం అయ్యింది. మురస తుఫాన్ సృష్టించిన విధ్వంసం నష్టం అంచనా ఎంత అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 

ఇదే సమయంలో వాతావరణ వాఖ మరో బాంబ్ పేల్చింది. 2026, నవంబర్ నెలలోనే.. నవంబర్ 15వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడుతుందని చెబుతోంది. నవంబర్ 15వ తేదీ నాటికి ఏర్పడే తుఫాన్.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల మధ్య ఉంటుందని అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు రాష్ట్రానికి రాబోయే తుఫాన్ భారీ ముప్పు తీసుకురావొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. వారం రోజుల్లో అంటే.. నవంబర్ 9, 10 తేదీల్లో ఈ తుఫాన్ పై స్పష్టమైన అంచనా వేస్తుందని వెల్లడించింది వాతావరణ శాఖ. 

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో.. వరసగా తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని.. ఓ వైపు ఎల్ నినో కొనసాగుతున్న సమయంలోనే.. ఈ తుఫాన్ లు ఏర్పడటం చూస్తుంటే ప్రకృతి విపత్తులు ఏపీ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో వణికిస్తున్నాయో అర్థం అవుతుంది. రాబోయే రెండు నెలలు ఏపీపై ప్రకృతి పగబట్టినట్లే అనుకోవాలి. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల థాటికి ఆంధ్రాలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు విలవిలలాడుతున్నాయి. భారీ నష్టంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక రాబోయే తుఫాన్ ఏ స్థాయిలో విరుచుకుపడి.. జనాన్ని, జనం ఆస్తులను, రైతుల పంటలను ఎంత నాశనం చేస్తుందో చూడాలి..