స్టూడెంట్లకు టీచర్లే మార్గదర్శకులు.. ట్రైనీ సివిల్ సర్వెంట్లు

స్టూడెంట్లకు టీచర్లే మార్గదర్శకులు.. ట్రైనీ సివిల్ సర్వెంట్లు

నేరడిగొండ, వెలుగు: స్టూడెంట్లకు టీచర్లే మార్గదర్శకులని, వారు తలుచుకుంటే ఏమైనా సాధించగలరని ట్రైనీ సివిల్ సర్వెంట్లు అన్నారు. పర్యటనలో భాగంగా సోమవారం వారు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రైమరీ,హై స్కూల్ లను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం బాగుందా? పాఠాలు బాగా చెప్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. 

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని టీచర్లకు సూచించారు. అనంతరం స్కూల్ బతుకమ్మ వేడుకలను నిర్వహించి, విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, ఆఫీసర్లు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.