మోల్డ్-టెక్ లాభం 36 శాతం అప్‌..సెప్టెంబర్ క్వార్టర్లో రూ.21 కోట్లు

మోల్డ్-టెక్ లాభం 36 శాతం అప్‌..సెప్టెంబర్ క్వార్టర్లో రూ.21 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సొల్యూషన్లు అందించే  హైదరాబాద్ కంపెనీ మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ నికర లాభం 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 36.06 శాతం పెరిగి రూ.21.09 కోట్లకు చేరుకుంది. అమ్మకాలు కూడా 30.73 శాతం వృద్ధితో రూ.274.23 కోట్లుగా నమోదయ్యాయి. ఇబిటా 29.80 శాతం పెరిగి రూ.51.27 కోట్లకు చేరింది. 

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ, ఫార్మా, ఫుడ్, ఎఫ్‌‌‌‌ఎంసీజీ ప్యాకేజింగ్ విభాగాల్లో బలమైన డిమాండ్ వల్లే ఈ అద్భుతమైన వృద్ధి సాధ్యమైంది. ఫార్మా ప్యాకేజింగ్ విభాగంలో 26.30 శాతం వృద్ధి నమోదైంది.  ఫుడ్, ఎఫ్‌‌‌‌ఎంసీజీ విభాగం 23.70 శాతం, పెయింట్స్ ప్యాకేజింగ్ 8.61 శాతం వృద్ధిని కనబరిచింది.  లూబ్రికెంట్స్ ప్యాకేజింగ్ విభాగంలో మాత్రం 12.32 శాతం క్షీణత కనిపించింది.