న్యూఢిల్లీ: దోహా వేదికగా జరగనున్న ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు ఇండియా–ఎ జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌కు హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మకు టీమ్‌లో ప్లేస్ లభించింది. రజత్ పటీదార్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్రాను వికెట్ కీపర్లుగా తీసుకున్నారు.
గ్రూప్–బిలో ఇండియాతో పాటు నేపాల్, పాకిస్తాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్–ఎలో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ నెల 20న నేపాల్‌తో, 22న పాకిస్తాన్‌తో, 24న యూఏఈతో ఇండియా మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్‌లో టాప్–2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. 29న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
ఇండియా జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (కీపర్), రింకు సింగ్, కుమార్ కుశాగ్ర (కీపర్), సూర్యాన్ష్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుశ్ కొటియాన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్.
