న్యూఢిల్లీ: న్యూజిలాండ్–ఎతో జరిగే మూడో అనధికార టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో ఉండటం లేదు. పక్కటెముకల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే నేరుగా టెస్ట్ జట్టుతో కలిసి బరిలోకి దిగనున్నాడు.
ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్న పంత్.. టెస్ట్ ఆడేందుకు కావాల్సిన ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేయలేకపోయాడు. దాంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరికొన్ని రోజుల్లో జరిగే రెండో ఫిట్‌నెస్ పరీక్షల్లో నెగ్గితే నేరుగా వెల్లింగ్టన్‌లో టెస్ట్ టీమ్‌తో కలుస్తాడని సమాచారం. ఈ నెల 7 నుంచి 10 వరకు లింకన్‌లో మూడో అనధికార టెస్ట్ జరగనుంది.
