నవంబర్ 20న విడుదల కానున్న ‘డానీ’.. వైల్డ్ కంటెంట్‌ తో రాబోతున్న రస్టిక్ లవ్ స్టోరీ

నవంబర్ 20న విడుదల కానున్న ‘డానీ’.. వైల్డ్ కంటెంట్‌ తో రాబోతున్న రస్టిక్ లవ్ స్టోరీ

ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో  కళ్యాణ్‌‌‌‌‌‌‌‌జీ గోగన దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించిన చిత్రం ‘డానీ’.  నవంబర్ 20న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో  ఆశిష్ గాంధీ మాట్లాడుతూ ‘ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా.  ఇందులో రాకేందు మౌళి పాటలు, సాయి కార్తీక్ మ్యూజిక్ గొప్పగా ఉంటుంది. 

ఈ సినిమా అందర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుంది’ అని చెప్పాడు.  ఈ  చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని సేజల్ గుప్తా చెప్పింది.  దర్శకుడు కళ్యాణ్‌‌‌‌‌‌‌‌జీ గోగన మాట్లాడుతూ  ‘ఇదొక డిఫరెంట్ లవ్ అండ్ రస్టిక్ డ్రామా. ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు డిఫరెంట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఇస్తుంది’ అని చెప్పాడు.  నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ ‘మా కాంబోలో ‘నాటకం’ తర్వాత చేస్తున్న సినిమా ఇది.  అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. గోవాలోనే ఎక్కువ భాగం చిత్రీకరించాం. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.  నటుడు అజర్ ఖాన్, లిరిసిస్ట్  రాకేందు మౌళి పాల్గొన్నారు.