పౌల్ట్రీ సమస్యలపై ఏఐపీబీఏ భేటీ 

పౌల్ట్రీ సమస్యలపై ఏఐపీబీఏ భేటీ 

హైదరాబాద్​, వెలుగు: తమ పరిశ్రమ సమస్యలపై చర్చించడానికి ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (ఏఐపీబీఏ), పాన్ ఇండియా బ్రీడర్స్ అసోసియేషన్ (పీఐబీసీసీ) నాయకులు హైదరాబాద్‌‌‌‌ శంషాబాద్‌‌‌‌లోని నోవాటెల్ హోటల్‌‌‌‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బ్రాయిలర్ చికెన్ ధరల హెచ్చుతగ్గులు, ఎల్ నినో ప్రభావంతో మొక్కజొన్న లాంటి దాణా కొరతపై చర్చించారు.

 ఏఐపీబీఏ చైర్మన్ బహదూర్ అలీ, పీఐబీసీసీ కన్వీనర్ వసంత్ కుమార్ శెట్టి, టీపీబీఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎ. తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లైవ్ చికెన్ కనీస ధరను కిలోకు రూ.110 గా నిర్ణయించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. పండుగల సీజన్ కారణంగానే చికెన్ వినియోగం తగ్గి ధరలు పడిపోయాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీళ్లు భరోసా ఇచ్చారు.