నవంబర్ 12న విడుదలకు సిద్ధమైన రాహుల్ విజయ్ ‘A’ మూవీ.. విడుదలైన ట్రైలర్

నవంబర్ 12న విడుదలకు సిద్ధమైన రాహుల్ విజయ్ ‘A’ మూవీ.. విడుదలైన ట్రైలర్

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో రూపొందిన   చిత్రం ‘అ’.  సాయి బాలి దర్శకత్వంలో  కనకరావు తొనంగి, అభిషేక్ కె, ఎడిటర్ గ్యారీ బీహెచ్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు.  నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు అతిథులుగా  హాజరైన డైరెక్టర్ నందినీ రెడ్డి, హీరో  ఆకాష్ పూరి, నిర్మాత వంశీ నందిపాటి ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. 

కార్యక్రమంలో పాల్గొన్న  శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.  రాహుల్ విజయ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా డార్క్ కామెడీ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఒక్క నిమిషం కూడా బోరింగ్‌‌‌‌‌‌‌‌గా  అనిపించదు’ అని చెప్పాడు.  ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యే కథ ఇదని, ఇందులో నటించడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ అర్చన అయ్యర్ చెప్పింది. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని, స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని దర్శకుడు సాయి బాలి అన్నాడు.  మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, సహ నిర్మాత అభినవ్ కునపరెడ్డి పాల్గొన్నారు.