త్వరలో తల్లి కాబోతున్న సమంత మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. తమ తొలిబిడ్డకు వెల్‌కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి సమంత తన ఇన్‌స్టా స్టేటస్‌లో ఓ క్యూట్ ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఆమె భర్త రాజ్ నిడిమోరు.. బేబీ మానిటర్ స్టాండ్‌ను అమర్చుతూ కనిపించారు. తండ్రి బాధ్యతల్లో రాజ్ బిజీగా ఉన్నారంటూ అభిమానులు ఈ ఫొటోకు అభినందనలు తెలియజేశారు.
ఇక తొమ్మిది నెలల గర్భవతి అయిన సమంత.. ఇటీవల తన వర్కౌట్ వీడియోస్‌తో పాటు ఆహారపు అలవాట్లు, యోగా, వ్యాయామం, బేబీ టిప్స్‌కు బంధించి బెస్ట్ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం’ అనే షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
