ప్రముఖ తమిళ టీవీ యాంకర్, నటి ప్రియవదన (Priya Vadhana) ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఆమె మృతి చెందడం తమిళ మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. న్యూస్ రీడర్‌గా ప్రేక్షకులకు పరిచయమైన ప్రియవదన.. ఇటీవలే సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాతో నటిగా కూడా సినీ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్‌లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాల్సిన సమయంలో ఆమె మరణవార్త వెలుగులోకి రావడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అక్టోబర్ 21, 2026న ప్రియవదన మృతిపై చెన్నై ప్రెస్ క్లబ్ ధ్రువీకరించింది. ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు, సహచర పాత్రికేయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అయితే, యాంకర్ కం నటి ప్రియవదన.. కేవలం 24 ఏళ్ల వయసులోనే సూసైడ్ ఎందుకు చేసుకుందనే విషయంపై కారణాలు తెలియాల్సి ఉంది.
న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్..
ప్రియవదన తమిళ టెలివిజన్ రంగంలో న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తొలుత వేందర్ టీవీలో పనిచేసిన ఆమె.. ఆ తర్వాత ప్రముఖ తమిళ న్యూస్ ఛానెల్ తంతి టీవీలో న్యూస్ రీడర్‌గా కొనసాగారు. వార్తలు చదువుతూ ప్రేక్షకులకు దగ్గరైన ప్రియవదన.. తనదైన గుర్తింపుతో మీడియా రంగంలో ముందుకు సాగారు.
న్యూస్ రీడర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ సత్తా చాటాలని ప్రయత్నించారు. నటనపై ఆసక్తితో సినిమా అవకాశాల వైపు అడుగులు వేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ప్రియవదన.. తన ఫొటోలు, వీడియోలు, ఫొటోషూట్ పిక్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఫాలోవర్లతో టచ్‌లో ఉండేవారు. ఇలా న్యూస్ రీడర్‌గా గుర్తింపు తెచ్చుకుంటూనే.. నటిగా తన కెరీర్‌ను బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేశారు.
సినిమాల్లోనూ ఎంట్రీ.. బర్త్ డే ఫొటోలు వైరల్
న్యూస్ రీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియవదనకు నటనపై కూడా ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి సినీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా జర్నలిజంతో పాటు నటనలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగేందుకు ప్రయత్నం చేసింది ప్రియవదన.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే ప్రియవదన తన 24వ పుట్టినరోజును జరుపుకుంది. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ప్రియవదన మరణానికి ముందు.. కోయంబత్తూరులో విజయ్ ప్రారంభించిన పెరియార్ సైన్స్ సెంటర్‌ను ప్రశంసిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. నటి అకాల మరణవార్త నేపథ్యంలో ఈ బర్త్ డే జ్ఞాపకాలు నెటిజన్లను ఎమోషనల్ చేస్తున్నాయి. కెరీర్‌లో మరిన్ని అవకాశాలతో ముందుకు సాగాల్సిన వయసులో ఆమె కన్నుమూయడం పలువురిని కలచివేస్తోంది.
தந்தி டிவி ப்ரியா வதனாவின் கடைசி இன்ஸ்டா வீடியோ 💔 https://t.co/fcUTxkC7Ve
— Anshitha🫶💖🍉 (@Anshithaprincey) October 22, 2026
చిన్న వయసులోనే తీరని లోటు..
ప్రియవదన అకాల మరణం మీడియా రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. న్యూస్ రీడర్‌గా గుర్తింపు తెచ్చుకుని, నటిగా ఎదుగుతున్న సమయంలో ఆమె కన్నుమూయడం తన సహచరులు, ఫాలోవర్లను కలచివేస్తోంది. ఈ క్రమంలోనే నటి ప్రియవదన మృతిపై పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
