Anupama Parameswaran: పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!

Anupama Parameswaran: పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి, దాంపత్య జీవితం గురించి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లికి ముందే ఒక బేబీని కనాలనుందని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా తన వ్యక్తిగత అభిప్రాయాలతో పాటు సినిమా విశేషాలను కూడా అనుపమ పంచుకుంది.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘క్రేజీ కళ్యాణం’ చిత్రమని అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. ఆమె లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో బద్రప్ప గాజుల దర్శకుడిగా  బూసం జగన్‌‌‌‌మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అనుపమ చెప్పిన విశేషాలు.

‘‘ఇదొక ఫన్, ఎమోషన్స్ కలగలిసిన కథ. సినిమాలోని పాత్రల కష్టాలు ప్రేక్షకులకు కామెడీగా అనిపిస్తాయి. దర్శకుడు బద్రప్ప చెప్పిన కథలోని నిజాయితీ నన్ను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా అంగీకరించా. ఈ చిత్రంలో కీర్తి పాత్రలో కనిపిస్తా. పెళ్లి, దాంపత్య జీవితంపై తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే క్యారెక్టర్. పెళ్లి అనేది ఇద్దరూ సంతోషంగా జీవించడానికి చేసుకోవాలి కానీ, అమ్మాయిని ఇంటి పనులకే పరిమితం చేయడానికి కాదని చూపించబోతున్నాం.

ఈ సినిమాలోలా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే మా వాళ్లు అంటారు. నాకైతే పెళ్లికి ముందే ఒక బేబిని కనాలనిఉంది. ఈ చిత్రం కోసం తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం కొత్త అనుభూతినిచ్చింది. అఖిల్ ఉడ్డెమారి నటనలోని ఎమోషనల్ హానెస్టీ ఉదయ్ పాత్రకు బాగా సరిపోయింది. తరుణ్ భాస్కర్ చేసిన బాలరాజు క్యారెక్టర్ మనలో ఒకరిగా అనిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్‌‌‌‌తో కలిసి పనిచేయడం ఎంతో ఇన్‌‌‌‌స్పైర్ చేసింది.

ఈ సినిమా  ప్రేక్షకులకు తమ ఇంటి కథలా  అనిపిస్తుంది. నటిగా నేనెప్పుడూ వెర్సటైల్ క్యారెక్టర్స్ చేయడమే నా లక్ష్యం.   డబ్బుల కోసం నటించాలనుకోవడం లేదు.  ప్రస్తుతం తమిళ, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నా.  అవన్నీ పూర్తిగా దేనికది భిన్నమైన చిత్రాలు’’ చేస్తున్నట్లుగా అనుపమ తెలిపింది..