Sharwa Dimple: పబ్లిక్గా ఓపెన్ అయిన శర్వానంద్.. “డింపుల్.. లవ్ యూ’’ అని చెప్పేసాడుగా!

Sharwa Dimple: పబ్లిక్గా ఓపెన్ అయిన శర్వానంద్.. “డింపుల్.. లవ్ యూ’’ అని చెప్పేసాడుగా!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా శర్వానంద్, డింపుల్ హయాతి పేర్లే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ‘భోగి’ సినిమా ప్రమోషన్స్ ఒకవైపు జోరుగా సాగుతుంటే.. మరోవైపు వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డింపుల్‌తో శర్వానంద్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం, ఆమె భుజంపై తల వాల్చి నవ్వుతూ కనిపించిన వీడియోలు వైరల్ కావడం, తాజాగా శర్వా స్టేజ్‌పైనే ‘డింపుల్.. లవ్ యూ ఆల్వేస్’ అంటూ చెప్పడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.

అయితే ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్స్‌లో కనిపిస్తున్న ఫ్రెండ్లీ బాండింగేనా? లేక వీరిద్దరి మధ్య నిజంగానే ఏదైనా ప్రత్యేకమైన బంధం ఉందా? అసలు ఈ రూమర్స్ వెనుక కథేంటి? మరోవైపు నవంబర్ 27న విడుదల కానున్న ‘భోగి’ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.. 

డింపుల్‌తో శర్వా బాండింగ్.. వీడియోలు వైరల్!

‘భోగి’ ప్రమోషన్స్‌లో శర్వానంద్, డింపుల్ హయాతి మధ్య కనిపిస్తున్న క్లోజ్‌నెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈవెంట్లలో సరదాగా మాట్లాడుకోవడం, ఆప్యాయంగా హత్తుకోవడం, డింపుల్ శర్వా భుజంపై తల ఆనించి నవ్వుతూ కనిపించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ నెటిజన్లు డేటింగ్ రూమర్స్‌కు తెరలేపారు. అంతేకాదు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.

‘డింపుల్.. లవ్ యూ ఆల్వేస్’: శర్వా స్పీచ్ వైరల్

‘భోగి’ మ్యూజికల్ నైట్‌లో డింపుల్ హయాతిని ఉద్దేశించి శర్వానంద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘డింపుల్.. లవ్ యూ ఆల్వేస్’ అంటూ అందరి ముందే చెప్పిన శర్వా.. ఆమె సెట్‌లోకి వస్తే పాజిటివ్ ఎనర్జీతో వాతావరణమే మారిపోతుందని.. ఆ అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని ఎలా అందిపుచ్చుకోవాలో తాను కూడా ఆమె దగ్గర నేర్చుకోవాలని ప్రశంసించారు. ఈ క్రేజీ కామెంట్స్ తో ఇప్పటికే చర్చలో ఉన్న వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

శర్వా పర్సనల్ లైఫ్‌పై చర్చ..

శర్వానంద్ వ్యక్తిగత జీవితం కూడా మరోసారి వార్తల్లో నిలిచింది. 2023లో రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్న ఆయనకు ఓ పాప ఉంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు కనిపించకపోవడంతో విడాకుల రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. దీనిపై శర్వా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో డింపుల్ హయాతితో ఆయన బాండింగ్ వీడియోలు వైరల్ కావడం మరింత చర్చకు దారితీసింది.

డింపుల్ రిప్లై వైరల్.. ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు’!

శర్వానంద్‌తో క్లోజ్ గా ఉన్న వీడియోపై ఓ నెటిజన్.. డింపుల్‌కు కూడా పెళ్లయిపోయింది కదా? అంటూ కామెంట్ చేశాడు. దీనికి ఆమె ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే శర్వాతో డేటింగ్ రూమర్స్ నడుస్తుండటంతో డింపుల్ నుంచి క్యూట్ రిప్లై రావడంతో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. 

‘భోగి’లో శర్వా మాస్ అవతార్.. కథేంటంటే?

‘భోగి’లో శర్వానంద్ పూర్తిగా కొత్త మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. భూస్వాముల ఆధిపత్యం, గ్రామీణ జీవితాలు, ప్రతీకారం కథలో కీలకంగా ఉండనున్నాయి.

ఇందులో గంగగా శర్వా కనిపించనుండగా, ప్రతి అమావాస్యకు గ్రామంలోని యువకులు అదృశ్యమవుతుండటం, ఆ మిస్టరీ వెనుక ఉన్న నిజాన్ని గంగ తెలుసుకునే ప్రయత్నం ఆసక్తి రేపుతోంది. డింపుల్ హయాతి మందారంగా, అనుపమ పరమేశ్వరన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్, మిస్టరీ కలగలిపిన కథతో ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్‌తో అంచనాలు పెంచిన సంపత్ నంది..

నవంబర్ 22న విడుదలైన ‘భోగి’ ట్రైలర్‌లో శర్వానంద్ మాస్ లుక్, రగ్డ్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో శర్వా కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమా కోసం తన కెరీర్‌లోని 37 సినిమాలకు కలిపి పడినంత కష్టం పడ్డానని శర్వా చెప్పడం విశేషం. మరోవైపు అనుపమ పరమేశ్వరన్‌తో తనకు అద్భుతమైన ప్రేమకథ ఉందని, గత 15-20 ఏళ్లలో ఇలాంటి లవ్ స్టోరీ చూడలేదని చెప్పి ఆసక్తి పెంచారు.

పాటలకు మంచి రెస్పాన్స్..

‘భోగి’కి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘ఎగిలివారంగ’ తెలంగాణ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తే, ‘అన్నయ్య పానం లో’ కుటుంబ అనుబంధాలను గుర్తుచేస్తోంది. ఇక నవంబర్ 25న విడుదలైన ‘గంగ’ థీమ్ సాంగ్‌లో శర్వా పాత్రను పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. చంద్రబోస్ సాహిత్యం, నల్గొండ గద్దర్ నర్సన్న గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.