సినిమా షూటింగులు, బాక్సాఫీస్ విజయాలు, అభిమానుల సందడి.. ఇలా ఎప్పుడూ బిజీగా ఉండే అల్లు కుటుంబం.. ఇప్పుడు ఫ్యామిలీ సమయాన్ని ఆస్వాదిస్తోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్‌తో పాటు కొత్త జంట అల్లు శిరీష్-నయనిక, తండ్రి అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలంకలో సందడి చేస్తున్నారు. ఒకే ఫ్రేమ్‌లో మూడు తరాల అల్లు కుటుంబ సభ్యులు కనిపించడంతో ఈ ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అర్హ బర్త్‌డే స్పెషల్..
నవంబర్ 21న అల్లు అర్హ పదో పుట్టినరోజు సందర్భంగా అల్లు కుటుంబం శ్రీలంకలో వెకేషన్‌కు వెళ్లింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను అల్లు శిరీష్ భార్య నయనికా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ రిసార్ట్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ సందర్భంగా దిగిన ఫొటోలో అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్–స్నేహారెడ్డి, అల్లు శిరీష్–నయనికా రెడ్డితో పాటు అర్హ, అయాన్ సందడి చేశారు. మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమాలకే కాదు.. ఫ్యామిలీ టైమ్‌కూ బన్నీ ఫుల్ ఇంపార్టెన్స్!
వరుస సినిమాలు, షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్ ఫ్యామిలీకి ప్రత్యేక సమయం కేటాయిస్తుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి తరచూ వెకేషన్లకు వెళ్తుంటారు. గతంలో అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్, ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో సందడి చేసిన బన్నీ ఫ్యామిలీ.. ఇప్పుడు శ్రీలంక టూర్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. కుటుంబంతో గడిపే మధుర క్షణాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు.
ALSO READ : ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
వరుస సినిమాలతో బిజీ.. లైనప్ చూస్తే మైండ్ బ్లాక్!
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' (AA22)తో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే బన్నీ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో AA23 చేయనున్నారు. మరోవైపు 'పుష్ప 3'పైనా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇలా వరుస భారీ ప్రాజెక్టులతో కెరీర్‌లో దూసుకెళ్తున్న బన్నీ.. వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెరపై మాస్ హీరోగా మెప్పించే ఆయన.. ఇంట్లో మాత్రం పిల్లలతో అల్లరి చేసే తండ్రిగా, కుటుంబంతో ఆనందంగా గడిపే వ్యక్తిగా కనిపిస్తుంటారు. అందుకే శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ సందడి చేస్తున్న ఫొటోలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
#RAAKA https://t.co/BY1dzQFLY8
— Allu Arjun (@alluarjun) April 8, 2026
