ట్రంప్‌ మళ్లీ టారిఫ్‌ బాంబ్‌.. భారత్‌ సహా 16 దేశాలు టార్గెట్‌

ట్రంప్‌ మళ్లీ టారిఫ్‌ బాంబ్‌.. భారత్‌ సహా 16 దేశాలు టార్గెట్‌

భారత్ సహా  వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్ పెంచేందుకు అమెరికా మరోసారి సిద్ధమైంది. అదనపు ఇండస్ట్రియల్ కెపాసిటీ సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే భారత్, చైనాతో పాటు16 ఇతర దేశాలపై సుంకాలను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం .వివరాల్లోకి వెళితే..

ది వాల్ స్ట్రీట్ జర్నల్ , భారతీయ ఆర్థిక సంస్థల రిపోర్టుల ప్రకారం..మార్చి11న ప్రారంభించిన సెక్షన్ 301 దర్యాప్తు ఫలితాలను యూఎస్ వాణిజ్య ప్రతినిధి (USTR) జేమీసన్ గ్రీర్  త్వరలో ప్రకటించనున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు ,పారిశ్రామిక మద్దతు అదనపు తయారీ సామర్థ్యాన్ని పెంచి, ప్రపంచ మార్కెట్లను చౌక వస్తువులతో ముంచెత్తి, యూఎస్ ఉత్పత్తిదారులకు నష్టం కలిగించాయని వాషింగ్టన్ భావిస్తోంది.ఈ క్రమంలో అమెరికా మార్కెట్ లో ఇతర దేశాల ఉత్పత్తుల  ప్రభావం తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. భారత్ తో పాటు మిగిలిన దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఇప్పుడున్న సుంకాలకు అదనంగా కొత్త టారిఫ్ లకు రెడీ అవుతోంది. 

నివేదికల ప్రకారం.. ట్రంప్ టారిఫ్ పెంపు ప్రభావం చూపే దేశాల్లో  భారత్, చైనాతో సహా జపాన్, దక్షిణ కొరియా ,యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికాలో చాలా వరకు దిగుమతి చేసుకున్న వస్తువులు దీని పరిధిలోకి వస్తాయి.. అయితే ఉక్కు, అల్యూమినియం ,ఆటోమొబైల్స్ వంటి వర్గాలకు మినహాయింపు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాటిపై ఇప్పటికే ప్రత్యేక జాతీయ భద్రతా సుంకాలు విధించారు. 

ALSO READ : హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్లలో స్మోకింగ్ బ్యాన్

టారిఫ్ ఎంత శాతం పెంచుతారనేది తెలియాల్సి ఉంది. 2025లో నాటి సుంకాలను ఇవి చాలావరకు పోలి ఉండవచ్చని అధికారులు సూచిస్తున్నారు. న్యూఢిల్లీ, వాషింగ్టన్‌లు ఇంకా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కృషి చేస్తున్న సమయంలో సుంకాల పెంపునకు అమెరికా రెడీ కావడం..భారతీయ ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగించే విషయం.