దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు: 15 వందల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ర్యాలీకి 7 కారణాలివే!

దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు: 15 వందల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ర్యాలీకి 7 కారణాలివే!

మంగళవారం సెలవు తర్వాత ఓపెన్ అయిన భారత స్టాక్ మార్కెట్లు అనూహ్యమైన లాభాలతో బుల్ జోరులో దూసుకుపోతున్నాయి. ఉదయం 10.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 15వందల పాయింట్లు లాభంతో దూసుకుపోతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 426 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1048 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 257 పాయింట్లు గెయిన్ అయ్యింది. 

ప్రధానంగా అమెరికా మార్కెట్లలో జెన్సెన్ హువాంగ్ ఎన్వీడియా సీఈఓగా రావటంతో భారీ లాభాల జోరు ఇవాళ ఇండియన్ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో దూసుకుపోతుండగా.. మెటల్, మీడియా స్టాక్స్ మాత్రం నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈరోజు భారత స్టాక్ మార్కెట్లను ఇంతగా ప్రభావితం చేసి లాభాల్లో నడిపిస్తున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మార్కెట్లను లాభాల్లో నడిపిస్తున్న ప్రధాన కారణాలు ఇవే:

1. FII కొనుగోళ్ల వెల్లువ: సోమవారం రూ. 5,672 కోట్ల షేర్లను కొన్న విదేశీ ఇన్వెస్టర్లు.. ఈ నవంబర్ నెలలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ.లక్షా 27వేల కోట్ల నిధులను భారత మార్కెట్లోకి కుమ్మరించారు.

2. ముడి చమురు ధరల తగ్గుదల: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 0.7% తగ్గి బ్యారెల్‌కు 90.80 డాలర్లకు చేరడంతో (నవంబర్‌లో 23% క్రాష్), భారత్‌కు క్రూడ్ దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణం భారం తగ్గుతుందన్న అంచనాలు పెరిగాయి.

3. ఇండియా విక్స్ తగ్గుదల: మార్కెట్ భయాందోళనలను సూచించే ఇండియా విక్స్ 3 శాతానికి పైగా తగ్గి 17.10 స్థాయికి దిగిరావడం ట్రేడర్లలో స్థిరత్వం, రిస్క్ తీసుకునే ధైర్యాన్ని పెంచింది.

4. Q2 కార్పొరేట్ ఫలితాలు: సెప్టెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ 50 కంపెనీల నికర లాభాలు 27 శాతం గ్రో అవ్వటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది.

5. రూపాయి బలపడటం: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం వల్ల విదేశీ మదుపర్లకు వచ్చే రాబడులు పెరుగుతాయన్న నమ్మకంతో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

ALSO READ : 10 గ్రాములకు రూ.3వేల 220 తగ్గిన గోల్డ్.. కేజీకి రూ.10వేలు తగ్గిన వెండి

6. ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు: ఇటీవలి కరెక్షన్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ షేర్ల ధరలు అందుబాటులోకి రావడంతో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.

7. గ్లోబల్ AI షేర్ల నుంచి నిధుల మళ్లింపు: అమెరికా, ఆసియా టెక్ మరియు AI షేర్లలో లాభాలను స్వీకరిస్తున్న అంతర్జాతీయ ఫండ్స్, ఆ నిధులను వృద్ధి అవకాశాలున్న భారత మార్కెట్లోకి మళ్లిస్తున్నాయి.