డిసెంబర్ మొదటి వారంలో 2 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. మోనోమార్క్ ఇంజినీరింగ్ ఇండియా,
మాతంగి రబ్బర్ కంపెనీలు తమ ఐపీఓలను తీసుకురానున్నాయి. మాతంగి రబ్బర్ ఐపీఓ 1–3 తేదీల మధ్య, మోనోమార్క్ ఇంజినీరింగ్ ఇష్యూ 2–4 తేదీల్లో ఉంటుంది. మోనోమార్క్ 2.70 కోట్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. మాతంగి రబ్బర్ ఐపీఓలో 57.62 లక్షల కొత్త షేర్లతో పాటు, ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 15.15 లక్షల షేర్లను విక్రయించనున్నారు.
