54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ (2026) వేడుకలు న్యూయార్క్‌లో ఘనంగా జరిగాయి. నవంబర్ 23న న్యూయార్క్ హిల్టన్ మిడ్‌టౌన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 64 నామినేషన్లు 16 విభాగాల్లో పోటీపడ్డాయి. ఈ ఏడాది అవార్డుల్లో యునైటెడ్ కింగ్‌డమ్ ఆధిపత్యం ప్రదర్శించింది. అత్యధికంగా 9 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డుల వేడుకల్లో విజయ్ సేతుపతి అవార్డు ప్రజెంటర్ గా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు విజయ్ సేతుపతి.
భారత్ నుంచి రెండు విభాగాల్లో నామినేషన్లు వచ్చినప్పటికీ అవార్డులు దక్కలేదు. వీర్ దాస్ తన నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్ ‘వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్’తో ఉత్తమ కామెడీ విభాగంలో పోటీపడ్డారు. అయితే ఈ అవార్డు అర్జెంటీనాకు చెందిన డివిజన్ పలెర్మో – సీజన్ 2కు లభించింది. మరోవైపు సోనీలివ్ వెబ్‌సిరీస్ ‘రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో అవార్డు దక్కించుకోలేకపోయింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘కారేమ్’ కు ఈ అవార్డు లభించింది.
ఈ వేడుకలో తమిళ నటుడు విజయ్ సేతుపతి అవార్డు ప్రజెంటర్‌గా పాల్గొన్నారు. అమెరికన్ నటుడు మైఖేల్ యూరీ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియాకు ఇంటర్నేషనల్ ఎమ్మీ ఫౌండర్స్ అవార్డు, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గెర్హార్డ్ జైలర్‌కు డైరెక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. అంతర్జాతీయ టెలివిజన్ రంగంలో ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు.
