Ayodhya to Janakpur: రాముడు పుట్టిన అయోధ్య నుంచి సీతాదేవి పెట్టిన జనక్ పురికి కొత్త రైలు సర్వీస్ ప్రారంభం అయ్యింది. భారత్ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో కలిసి ప్రధాని మోదీ ఈ రైలును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు ఢిల్లీ మీదుగా నేపాల్ దేశంలోని జనక్ పురికి వెళుతుంది. రాముడి పుట్టిన నేల నుంచి సీతాదేవి జన్మించిన ప్రాంతానికి వెళుతుంది. ఈ రైలుకు సరయూ కమలా ఎక్స్ ప్రెస్ అని నామకరం చేశారు.
అయోధ్య నుంచి నేపాల్ దేశంలోని జనక్ పురికి వెళ్లే ఈ రైలు.. మానక్ పూర్, బస్తీ, గోరఖ్ పూర్, నార్కటియాగంజ్, రక్సౌల్, సీతామర్హి, శిశో, మధుబని, జయనగర్ మీదుగా ప్రయాణిస్తుంది. మొత్తం 17 కోచ్ లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది ఏసీ కోచ్ లు ఉండగా.. ఏడు స్లీపర్ కాస్ కోచ్ లు ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ రైలులో దివ్యాంగుల కోసం ప్రత్యేక కోచ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా ఒక లగేజీ కోచ్ ఉంది. రెండు ప్రాంతాల మధ్య దూరం 604 కిలోమీటర్లు. 19 గంటల ప్రయాణం ఉంటుందని స్పష్టం చేసింది రైల్వే శాఖ.
#WATCH | Delhi | PM Narendra Modi and Nepali PM Balendra Shah witness a presentation on PM- Gatishakti (Video source: DD) https://t.co/sggCkwDNnJ
— ANI (@ANI) November 23, 2026
#WATCH | Ayodhya, UP: Prime Minister Narendra Modi and Nepal Prime Minister Balendra Shah are scheduled to virtually flag off the Saryu-Kamala Express, a new weekly train service between Ayodhya Cantt in Uttar Pradesh and Janakpur Dham in Nepal, today Visuals of the train at Ayodhya Junction
— ANI (@ANI) November 23, 2026
