భారత్‌లోకి వియత్నాం కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 2027 లో  లాంచ్

భారత్‌లోకి వియత్నాం కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 2027 లో  లాంచ్
  •     లాంచ్ చేస్తామని ప్రకటించిన వియత్నాం కంపెనీ

న్యూఢిల్లీ: వియత్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీల) తయారీ కంపెనీ విన్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ వచ్చే ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లోపు ఇండియాలో  ఎలక్ట్రిక్ టూవీలర్లను లాంచ్ చేస్తామని ప్రకటించింది.  తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో తయారయ్యే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు విన్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ ఇండియా మార్కెట్ సీఈఓ అనురాగ్ సక్సేనా తెలిపారు.

బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో పాటు 2029 వరకు ఫ్రీ ఛార్జింగ్, లాంగ్‌‌‌‌‌‌‌‌టర్మ్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ గ్యారంటీ వంటి ఆఫర్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం భారత్‌‌‌‌‌‌‌‌లో వీఎఫ్‌‌‌‌‌‌‌‌ 6, వీఎఫ్‌‌‌‌‌‌‌‌ 7 సహా నాలుగు ఈవీ కార్లను విక్రయిస్తున్న విన్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్, వచ్చే ఏడాది ఆరంభంలో కాంపాక్ట్ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ వీఎఫ్‌‌‌‌‌‌‌‌ 5 సహా కనీసం రెండు కొత్త కార్లను తేనుందని  కంపెనీ ఆసియా సీఈఓ తపన్ ఘోష్ వెల్లడించారు. ఇప్పటివరకు ఇండియాలో 500 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన విన్‌‌‌‌‌‌‌‌గ్రూప్, ఛార్జింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడానికి మొత్తం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది.