దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పద్మారావునగర్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో కేంద్రం డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎస్వీఐటీ మహబూబ్ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన నషా ముక్త్ భారత్ –-ప్రవాస్ మిలాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

2029 డిసెంబర్ నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. మత్తుపై పోరాటం ఇంటి నుంచే ప్రారంభం కావాలని, తల్లిదండ్రులు పిల్లలతో మనసు విప్పి మాట్లాడుతూ.. వారిని సరైన దారిలో నడిపించాలని సూచించారు. వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.