4 బంతుల్లో 4 వికెట్లు..  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జంషెడ్ ఆలం సంచలనం 

4 బంతుల్లో 4 వికెట్లు..  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జంషెడ్ ఆలం సంచలనం 

Jamshed Alam: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఎలైట్ 2026 టోర్నీలో క్రికెట్ అభిమానులు ఊపిరి బిగబట్టే అద్భుతం చోటు చేసుకుంది. సౌరాష్ట్రతో జరిగిన కీలక పోరులో రైల్వేస్ యువ పేసర్ జంషెడ్ ఆలం (Jamshed Alam) బంతితో నిప్పులు చెరుగుతూ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు (Double Hat-trick) పడగొట్టి సంచలనం సృష్టించాడు. మ్యాచ్‌లో మొత్తంగా 38 పరుగులు ఇచ్చి 5 వికెట్లు కూల్చిన ఈ 23 ఏళ్ల పేసర్, సౌరాష్ట్రను 153/8 స్కోరుకే కట్టడి చేసి రైల్వేస్‌కు 29 పరుగుల ఉత్కంఠ విజయాన్ని అందించాడు.

నాలుగు బంతుల్లో నలుగురు ఔట్: 

* రైల్వేస్ నిర్దేశించిన 183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌరాష్ట్రకు ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే జంషెడ్ ఆలం కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 

* వరుసగా 4 వికెట్లు: ఆ ఓవర్లో ముందుగా హర్విక్ దేశాయ్ను పెవిలియన్‌కు పంపిన ఆలం, ఆ తర్వాతి మూడు బంతుల్లో వరుసగా ప్రేరక్ మాంకడ్, రుచిత్ అహిర్, సమ్మర్ గజ్జర్లను ఔట్ చేసి అరుదైన డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

* మిథున్, నల్కండే సరసన రికార్డు: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్ గా జంషెడ్ ఆలం చరిత్ర సృష్టించాడు. గతంలో అభిమన్యు మిథున్, దర్శన్ నల్కండే మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు.

ఆకట్టుకున్న U-19 ఆసియా కప్ హీరో: 

ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఓటమి పాలైనప్పటికీ, అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మొహిత్ ఉల్వా (Mohit Ulva) తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. తొలుత బౌలింగ్‌లో 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మొహిత్, లక్ష్య ఛేదనలోనూ కేవలం 15 బంతుల్లో 22 రన్స్ చేసి జట్టును గెలిపించేందుకు పోరాడాడు. కానీ, జంషెడ్ ఆలం ఐదు వికెట్ల ధాటికి సౌరాష్ట్ర 153/8 స్కోరుకే పరిమితం కావడంతో మొహిత్ పోరాటం వృథా అయింది.