Pat Cummins: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. బిజీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ కారణంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్న తరుణంలో.. కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) రాబోయే సీజన్‌కు అందుబాటులో ఉంటాడని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే SRH యాజమాన్యం కమిన్స్‌ను రిటైన్ చేసుకోగా, అతడు ఖచ్చితంగా ఐపీఎల్ 2027 ఆడతాడని సన్‌రైజర్స్ జట్టులోని ఒక ఆటగాడు ఫ్రాంచైజీకి ధృవీకరించినట్లు తెలుస్తోంది.
ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు? క్రికెట్ ఆస్ట్రేలియా ఆంక్షలు:
* గత సీజన్ (IPL 2026) 2026 టీ20 ప్రపంచకప్ ముగిసిన కొద్దిరోజులకే ప్రారంభం కావడంతో కమిన్స్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ ఆలస్యంగా జట్లతో చేరి ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇప్పుడు IPL 2027 ముందు కూడా కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తున్నాయి.
* వరుస మెగా టోర్నీలు: ఆస్ట్రేలియా జట్టుకు రాబోయే కాలంలో యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్, 2025-27 WTC ఫైనల్ రేసు లాంటి కీలక సిరీస్‌లు ఉన్నాయి.
* పూర్తి సీజన్ ఆడతాడా?: ఇటీవల దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ చేతిలో టెస్టుల్లో ఎదురైన ఓటముల నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీంతో కమిన్స్ సీజన్ మొత్తం ఆడతాడా లేక గత ఏడాదిలా కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడా అనే దానిపై సీజన్ ఆరంభం నాటికి పూర్తి క్లారిటీ రానుంది.
కమిన్స్‌ను చుట్టు సాండ్‌పేపర్‌గేట్ వివాదం:
మైదానంలో ప్రదర్శనల కంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను 2018 నాటి 'సాండ్‌పేపర్‌గేట్' (బాల్ ట్యాంపరింగ్) వివాదం కుదిపేస్తోంది. మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇటీవల విడుదల చేసిన తన ఆత్మకథలో.. 2018 కేప్‌టౌన్ టెస్టులో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి జట్టులోని ఆటగాళ్లందరికీ ముందే తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రస్తుత టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌పై ఈ వివాదం కారణంగా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
