బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ.. అభిమానుల గుండెల్లో ఐకాన్ స్టార్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సినీ ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ డమ్ ఉన్నా.. కుటుంబం విషయాంలో మాత్రం మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంటారు. ముఖ్యంగా తన పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు బన్నీ.. లేటెస్ట్ గా తన ముద్దుల కుమార్తె అల్లు అర్హ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల మసులు గెలుచుకుంటోంది.
తన కుమార్తెతో కలిసి ఉన్న అందమైన మోనోక్రోమ్ ఫొటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు అల్లు అర్జున్.. "హ్యాపీ బర్త్‌డే టు ది జాయ్ ఆఫ్ మై లైఫ్" అంటూ హృదయాన్ని తాకే క్యాప్షన్ జోడించారు. ఈ చిన్న సందేశంలోనే కూతురిపై ఆయనకున్న అపారమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. సెలబ్రిటీల హడావుడి, కెమెరాల మెరుపులు పక్కనపెడితే.. ఓ తండ్రిగా అర్హపై బన్నీ చూపిస్తున్న ఆప్యాయత నెటిజన్లను ఫిదా చేస్తోంది.
మరోవైపు అర్హ పుట్టినరోజును కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా జరుపుకునేందుకు అల్లు అర్జున్ శ్రీలంకకు వెళ్లినట్లు సమాచారం.. అయితే ఈ పర్యటనకు సంబంధించి అధికారిక వివరాలు మాత్రం వెల్లడికాలేదు. 'శాకుంతలం' సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమైన అర్హకు ఆ చిత్ర నిర్మాణ సంస్థ గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. అటు ఫ్యాన్స్ కూడా నెట్టింట శుఖాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
►ALSO READ | HanuMan 2: 'హనుమాన్' సీక్వెల్‌పై బిగ్ ట్విస్ట్.. వైష్ణవ్ తేజ్‌తో 'హనుమాన్ 2'.. ప్రశాంత్ వర్మకు ప్రైమ్‌షో షాక్!
ఇక బన్నీ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'రాకా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రియల్‌టైమ్ మోషన్ క్యాప్చర్‌లో 37 మంది కళాకారులతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడం విశేషం. ఇలా కెరీర్‌లో ప్రపంచ రికార్డుల వేట కొనసాగిస్తూనే.. వ్యక్తిగత జీవితంలో కూతురి చిరునవ్వునే తన అసలైన విజయంగా భావిస్తున్న బన్నీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు...
Happy birthday to the Joy of My Life 💖 #AlluArha https://t.co/BxhNOS9WYC
— Allu Arjun (@alluarjun) November 21, 2026
