SSC నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 320 పోస్టులు.. డిసెంబర్ 8 లాస్ట్ డేట్

 SSC నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 320 పోస్టులు.. డిసెంబర్ 8  లాస్ట్ డేట్

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) గ్రేడ్-'సి' స్టెనోగ్రాఫర్స్ లిమిటెడ్ డిపార్ట్​మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (ఎల్​డీసీఈ)– 2026 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు  సర్వీసులు, కేడర్లలో మొత్తం 320 ఖాళీల భర్తీ చేయనున్నారు. 

పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ – సి.

మొత్తం ఖాళీలు: 320.

విభాగాల వారీగా ఖాళీలు: సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (డీఓపీటీ) 287, రైల్వే బోర్డ్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 8, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ 14,  ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్రాంచ్ (బి) స్టెనోగ్రాఫర్స్ 8, ఎలెక్షన్ కమిషన్ ఆఫ్​ ఇండియా స్టెనోగ్రాఫర్ సర్వీస్ 1, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2. 

సర్వీసు అర్హత: ఆరు సర్వీసులు/ కేడర్లలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-'డి' ఉద్యోగులుగా రెగ్యులర్ సర్వీసులో ఉన్నవారు మాత్రమే అర్హులు.

వయోపరిమితి: ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీఈ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని కేడర్లకు కలిపి ఉమ్మడి కనీస/ గరిష్ట వయోపరిమితి లేదు. అభ్యర్థులు తమ విభాగానికి వర్తించే నిబంధనలు, సర్వీసు అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: డిసెంబర్ 8.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2027, ఫిబ్రవరి – మార్చి (తాత్కాలికం). 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్   ssc.gov.inను సందర్శించండి.