- దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఎయిర్టెల్విలువ రూ.4 లక్షల కోట్లు .
- మీషో, రాయల్ ఎన్ఫీల్డ్ టాప్ రైజర్స్
- క్యాంటర్ బ్రాండ్ జెడ్ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: ఎయిర్టెల్ దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా ఎదిగిందని క్యాంటర్ బ్రాండ్జెడ్ 2026 ర్యాంకింగ్స్ రిపోర్ట్ వెల్లడించింది. 2014లో ఈ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థ టాప్‌లోకి రావడం ఇదే తొలిసారి. ఏడాదిలో బ్రాండ్ విలువ 5 శాతం పెరిగి 43.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.4 లక్షల కోట్లు) చేరింది. 2020తో పోలిస్తే 210 శాతం వృద్ధి నమోదైంది. దేశంలోని టాప్ 100 బ్రాండ్ల మొత్తం విలువ 460.3 బిలియన్ డాలర్లకు చేరినా, గత ఏడాదితో పోలిస్తే 12 శాతం తగ్గింది. ఈ మొత్తం దేశ జీడీపీలో 11 శాతానికి సమానం. ఈ ఏడాది అత్యధిక వృద్ధి సాధించిన బ్రాండ్లలో మీషో ముందుంది. దీని విలువ 64 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లకు చేరింది. రాయల్ ఎన్ఫీల్డ్ 60 శాతం వృద్ధితో 3.8 బిలియన్ డాలర్ల విలువ సాధించింది. టాప్ 10లో ఎయిర్టెల్ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి.
