- 20 స్టార్టప్స్‌ను నిర్మించాలని లక్ష్యం
- రూ.100 కోట్లతో మొదటి ఫండ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే హైకర్ వెంచర్ స్టూడియో తన ఆఫ్‌లైన్ స్టూడియో 'హైకర్ స్టార్టప్ షోకేస్ 26' వేదికగా శుక్రవారం అధికారికంగా ప్రారంభించింది. సుమారు 50 స్టార్టప్‌లకు వసతి కల్పించేలా రూపొందించిన ఈ కేంద్రంలో 150 మంది కూర్చునే ఆంఫీథియేటర్, పాడ్‌కాస్ట్ స్టూడియో, ఇన్వెస్టర్ గదులు ఉన్నాయి. సాంప్రదాయ వీసీ సంస్థల్లా కాకుండా, హైకర్ ప్రతి స్టార్టప్‌లో సహ-వ్యవస్థాపకుడిగా చేరి 25 శాతం వాటా తీసుకుంటుంది.
రూ.100 కోట్ల మొదటి ఫండ్‌తో ఏఐ ఆధారిత డీప్ టెక్, హెల్త్, క్లైమేట్ టెక్ రంగాల్లో 20 స్టార్టప్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో సంస్థలో రూ.4 కోట్ల వరకు పెట్టుబడి పెడుతూ 24 నెలల్లో వృద్ధిలోకి తెచ్చి 3 నుంచి 5 రెట్ల లాభంతో ఎగ్జిట్ అవుతుంది. బెంగళూరు ఇప్పటికే స్టార్టప్‌లతో నిండిపోవడంతో, ఇతర నగరాల ప్రతిభను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు సంస్థ ఫౌండర్ కృష్ణ దుంతూరి తెలిపారు.
