వరంగల్‌‌‌‌‌‌‌‌ను స్పోర్ట్స్ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి

వరంగల్‌‌‌‌‌‌‌‌ను స్పోర్ట్స్ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి

గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌ను స్పోర్ట్స్ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం హనుమకొండ జవహర్‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ స్టేడియంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, 70వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌‌‌‌‌‌‌‌జీఎఫ్‌‌‌‌‌‌‌‌) హాకీ పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా వచ్చే నెల 18 నుంచి 21 వరకు జేఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రానికి జాతీయ స్థాయి క్రీడల నిర్వహణ బాధ్యతలు రావడం గర్వకారణమని, హాకీతో పాటు అన్ని క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయి, సీపీ శ్వేత తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి, హాకీ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖేలో ఇండియా వాల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, ఖేలో ఇండియా నోడల్ అధికారి పవన్ తదితరులు పాల్గొన్నారు.